ఖానాపూర్
సుగుణక్కనే విజయం సాధిస్తారు
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణక్కనే విజయం సాధిస్తారని ఖానాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్ అన్నారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని వెల్లడించారు. ఎంపీ ఎన్నికల్లో ఆశ్రమం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు.