మధర్ డెయిరీ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ కు అంతరాయం
మధర్ డెయిరీ సబ్ స్టేషన్ పరిధి గణేశ్ నగర్ ఫీడర్ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 11. 30గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు గణేశ్ నగర్, వేంకటేశ్వర కాలనీ, రవిశంకర్ కాలనీ, శివశంకర్ కాలనీ, మన్సాని కాలనీ, కుంట్లూరు పాత గ్రామం పరిసర ప్రాంతాలు, సర్వే నంబర్ 100, 99, 78లలోని కాలనీలు, శ్రీపాద నగర్, బలహీన వర్గాల కాలనీ, ప్రజయ్ గుల్మోహర్ కాలనీ తదితర కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ వెల్లడించారు.