ఖతార్లో కోనసీమ మహిళ ఆవేదన
ఖతార్లో కొనసీమ జిల్లాకు చెందిన మహిళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోసమని రాయవరం మండలానికి చెందిన ఆమె .. ఓ ఏజెంట్ ద్వారా ఖతార్ వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఏజెంట్ చేతిలో మోసపోయారు. చాలా ఇబ్బందులు పడిన మహిళకు ఇటీవల కాలంలో గుండె నొప్పి వచ్చింది. దీంతో బాధితురాలి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనని ఎలాగైనా ఇండియాకు తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, సుభాశ్ను వేడుకుంటూ ఓ వీడియో విడుదల చేసింది.