BREAKING: 3,445 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. 3,445 ఉద్యోగాలకు RRB తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. టికెట్ క్లర్క్ - 2022, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 990, ట్రైన్ క్లర్క్- 72 పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ అయి 18-33 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు rrbapply.gov.in వెబ్సైట్ సందర్శించగలరు.