వాయుగుండం ప్రభావం.. తెలంగాణలో వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. మంగళవారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున సిద్దిపేటలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు మొదలైంది. వాయుగుండం రేపు తీరం దాటే అవకాశం ఉండటంతో మరో రెండు రోజుల వరకు రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.