చేర్యాల: జన్మదినాన్ని పురస్కరించుకుని అంగన్వాడికి సామాగ్రి అందజేత
సిద్ధిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని అంగన్వాడి విద్యార్థి జూపల్లి ప్రవర్ష తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా మంగళవారం 11వ అంగన్వాడి కేంద్రంలో జన్మదిన వేడుకలు స్థానిక టీచర్ తాటిపాముల కృష్ణవేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు అంగన్వాడి కేంద్రానికి కుర్చీలు, మ్యాట్స్, చెత్త డబ్బాలను బహుకరించారు.