హెచ్సీఏ వివాదాలపై సుప్రీంకోర్టులో విచారణ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో వివాదాలు సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. హెచ్సీఏ పాలనా సిఫార్సులకు సంబంధించి ఎక్కువ మంది మెంబర్లు కుటుంబ సభ్యులేనని సుప్రీంకోర్టు నియమించి జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సిఫార్సును వ్యతిరేకిస్తూ హెచ్సీఏ సభ్యులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది. ఈ కేసు తదుపరి విచారణను రేపు (గురువారం) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ బెంచ్ నిర్ణయించింది.