నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు
సరదాగా స్నానానికి వెళ్లి నదిలో ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన తీవ్ర విషాదం నింపింది. కుమురంభీం(D) బెజ్జూరు(M)కు చెందిన జహీర్హుస్సేన్ (22), హిర్షాద్(18), మోహిజ్ (20), ఖాజీమ్ స్నానం చేయడానికి సోమినిలోని ప్రాణహిత ఎర్రబండ రేవుకు వెళ్లారు. ఈ క్రమంలో జహీర్ హుస్సేన్, హిర్షాద్, మోహిజ్లు నీటిలో గల్లంతయ్యారు. భయభ్రాంతులకు గురైన ఖాజీమ్ సెల్ఫోన్లో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు సీఐ రమేశ్ తెలిపారు.