ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి (వీడియో)
TG: నారాణయపేట జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కర్ణాటక సరిహద్దులోని కృష్ణానది వంతెనపై.. రాయచూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కఠికే సురేష్ అనే వ్యక్తి మరణించాడు. బస్సులో ఫుట్ బోర్డు వద్ద నిలబడి ఉండగా లారీ ఢీకొట్టడంతో ఎగిరి కిందపడి సురేష్ చనిపోయారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయపడ్డారు.