రైతులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త
రైతులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాల దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు ప్రతి గ్రామంలో పశుగ్రాస క్షేత్రాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పశుగ్రాసం పెంపకంలో భాగంగా రైతులకు ఉన్న పొలంలో కనీసం 25 గుంటల నుంచి 3 ఎకరాల వరకు పశుగ్రాసాన్ని పెంచేలా ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఒక ఎకరాకు రూ.లక్ష వరకు సహాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.