ఈ-పంట నమోదు వివరాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
శింగనమల మండలంలో ఖరీఫ్ 2024 సీజన్ లో నమోదు అయిన ఈ-పంట వివరాలను క్షేత్ర స్థాయిలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పరిశీలన చేశారు. ఇందులో భాగంగా శింగనమల రెవెన్యూ గ్రామంలోని 425/9 సర్వే నెంబర్ లోని మామిడి, సోదనపల్లి రెవెన్యూ గ్రామంలోని 268/2, 289-2లో వరి పంటను, కల్లుమడి గ్రామంలోని వరి పొలాలను జాయింట్ కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా రైతులతో వారు సాగు చేసిన పంటల వివరాలను జెసి అడిగి తెలుసుకున్నారు.