ధర్మవరం: ఏపీలో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లు: మంత్రి
రాష్ట్రంలోని 22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో ఎఫ్ఎస్ఎస్ఎతో రూ. 88 కోట్ల ఎంవోయూ కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. తిరుమల, కర్నూలులో రూ. 40 కోట్లతో సమగ్ర ఆహార పరీక్షల ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఆహార భద్రత ప్రమాణాల చట్టం అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.