ధర్మవరం: తెలుగువారి సంస్కృతిని భావితరాలకు అందించాలి: మంత్రి
తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ మంగళవారం పిలుపునిచ్చారు. ధర్మవరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సంక్రాంతిని పురస్కరించుకుని తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కుల, మత వర్గాలకు అతీతంగా పండుగ జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. ఇలాంటి సంస్కృతిని భావితరాలకు అందించాలని కోరారు.