అల్లవరం: కరెంటు షాక్ తో సొసైటీ సీఈవో మృతి
అల్లవరం మండలం డి. రావులపాలానికి చెందిన దేవగుప్తం సొసైటీ సీఈవో స్వామినాయుడు (40) మంగళవారం రాత్రి కరెంటు షాక్ తో మృతి చెందారు. రొయ్యల చెరువుల వద్ద ఏరియేటర్లు ఆన్ చేసేందుకు చెరువుల వద్దకు వెళ్లాడని అతను ఎంతసేపటికి రాకపోవడంతో చెరువుల వద్దకు వెళ్లి చూడగా పడిపోయి ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందాడని, దీనిపై కేసు నమోదు చేసామని ఎస్ఐ హరీష్ బుధవారం తెలిపారు.