
కాకినాడ: పోలీసు అధికారులు గ్రామాల సందర్శన తప్పనిసరిగా చేయాలి
పోలీసు అధికారులు గ్రామాల సందర్శన తప్పనిసరిగా చేయాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమావేశ మందిరం హాల్ లో కాకినాడ జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కాకినాడ, పెద్దాపురం డివిజన్ పరిధిలో నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, అస్తి సంబంధిత నేరాలు, చేధనల గురించి పోలీస్ స్టేషన్ వారీగా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.