
గొల్లప్రోలు: డ్రెయినేజీలో విద్యుత్ స్తంభం
గొల్లప్రోలు పట్టణంలో ఎస్సి ఏరియాలో మురుగునీరు పారే డ్రెయినేజీ కాలువలలో విద్యుత్ స్తంభాలు దర్శనమిస్తున్నాయి. ఈ విద్యుత్ స్తంభాల వల్ల మురుగునీరు పారడం లేదు. దీంతో ఆ ప్రాంతం దుర్వాసన వ్యాపిస్తుంది. దీనికితోడు దోమలకు ఆవాశంగా మారుతోంది. దీంతో కంటిమీద కునుకు లేకుండా పోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే డ్రెయినేజీలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.