
పిఠాపురం: కుమారపురంలో వ్యక్తిపై కత్తితో దాడి
పిఠాపురం మండలం కుమారపురంలో గురువారం ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. గ్రామీణ ఎస్సై గుణశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం. కుమారపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, అనంతయ్యకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతయ్య ఇంట్లో నుంచి కత్తి తెచ్చి శ్రీనివాసరావును కత్తితో తలపై నరికారు. రక్తస్రావమైన శ్రీనివాసరావును పిఠాపురంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.