
రాజవొమ్మంగి: సారా వ్యాపారం నుంచి బయట పడండి
జీవితాలను, ఆరోగ్యాన్ని నాశనం చేసే నాటు సారా తయారీ, విక్రయాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ సీఐ శ్రీధర్ కోరారు. రాజవొమ్మంగి, జడ్డంగి గ్రామస్థులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పలు మార్లు సారాతో పట్టుబడితే పీడీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సారా వ్యాపారం నుంచి బయటకు వచ్చి ఇతర వృత్తిని ఎంపిక చేసుకోవాలని, ప్రభుత్వం తగిన సహాయం అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు.