

దేవీపట్నం: తెలుగు ప్రజల కోసం పార్టీని స్థాపించారు
దేవీపట్నం మండలంలోని ఇందుకూరుపేటలో ఉన్న టిడిపి కార్యాలయంలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు మరిసెట్ల వెంకటరావు పాల్గొని నాయకులతో కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ. స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు ప్రజల కోసం తన వంతు కర్తవ్యంగా సేవ చేయాలనే 1982లో పార్టీని స్థాపించారన్నారు.