
రాజవొమ్మంగి: పది పరీక్షకు వచ్చిన దివ్యాంగురాలు
రాజవొమ్మంగిలో ఓ దివ్యాంగురాలు టెన్త్ పరీక్షలకు హాజరైంది. వివరాల్లోకి వెళ్తే గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న దివ్యాంగురాలు గుమ్మల దేవి సోమవారం జడ్పీ ఉన్నత పాఠశాలకు పరీక్షా రాయడానికి వీల్ చైర్లో వచ్చింది. పుట్టుకతోనే దివ్యాంగురాలైన ఆమె మనోధైర్యం కోల్పోకుండా తోటి విద్యార్థులతో సమానంగా చదువుతోందని హెచ్ఎం సుశీల అన్నారు.