పెండింగ్ కోర్టు కేసులను పరిష్కరించుకోవాలి
రాజీమార్గమే రాజ మార్గమని భావించి కక్షిదారులు తమ పెండింగ్ కోర్టు కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణాసారిక పేర్కొన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ మచిలీపట్నంలోని న్యాయస్థానాల సముదాయ ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో కక్షిదారులు, అధికారులతో సమావేశం నిర్వహించి, లోక్ అదాలత్ ప్రారంభించారు.