అవుట్ పోస్ట్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల
డోన్ పట్టణానికి నూతన అవుట్ పోస్ట్, ట్రాఫిక్ సంబంధించిన వాహనాలు రావడం శుభ పరిమాణం అని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, నంద్యాల ఎస్పీ అదిరాజు సింగ్ మంగళవారం అన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిందని దీని వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి ఒక్క వాహనదారులు వారి వాహనాలను పార్కింగ్ ప్లేస్ లలో మాత్రమే నిలుపుదల చేసుకోవాలని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు.