ఆదోని: గూడ్స్ రైలు ఢీకొని యువకుడికి గాయాలు
ఆదోని మండలంలోని కుప్పగల్ సమీపంలో గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని మల్లికార్జునకు సోమవారం గూడ్స్ రైలు ఢీకొనడంతో తలకు గాయాలయ్యాయి. రైల్వే ఎస్సై గోపాల్ తెలిపిన మేరకు వివరాలు కొన్నేళ్ల నుంచి మల్లికార్జున అనే యువకుడికి మతిస్థిమితం లేదని, గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ పై వెళ్తుండగా గూడ్స్ రైలు వచ్చి స్వల్పంగా ఢీకొట్టిందన్నారు. వెంటనే స్థానికులు ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారని చెప్పారు.