ఆదోని: ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి
ఆదోని పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను గడువులో పరిష్కరించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయా మండలాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు నిర్లక్ష్యం లేకుండా నాణ్యంగా పరిష్కరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్ఏలోకి. వెళ్లకుండా చూడాలని ఆధికారులను ఆదేశించారు.