నాగర్ కర్నూల్: గుర్తుతెలియని మృతదేహం లభ్యం
నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ గేట్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే పోలీసులను సంప్రదించాలన్నారు.