కల్వకుర్తి: సివిల్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదుల నియామకం
కల్వకుర్తి సీనియర్, జూనియర్ సివిల్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదుల నియామకం జరిగినట్లు మంగళవారం కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. వి. రమణ తెలిపారు. సీనియర్ సివిల్ కోర్టులో వెంకటరెడ్డి, జూనియర్ సివిల్ కోర్టులో లక్ష్మణ్ రాజును ప్రభుత్వ న్యాయవాదులుగా నియామకం జరిగినట్లు ఆయన తెలిపారు. కల్వకుర్తి న్యాయవాదులు ప్రభుత్వ న్యాయవాదులను సన్మానించి హర్షం వ్యక్తం చేశారు.