పాతపట్నంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్టు
పాతపట్నంలోని ఆంధ్ర-ఒడిషా బోర్డర్ వద్ద సోమవారం గంజాయి తరలిస్తున్న ఇద్దురు నిందితులను పట్టుకున్నట్లు ఏఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద 18. 840 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. ఒడిశా నుంచి చెన్నైకు గంజాయి తరలిస్తున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. ఆయనతో పాటు సీఐ రామారావు, ఎస్ఐ లావణ్య ఉన్నారు.