ఎన్టీఆర్ కాలనీ జలమయం
ఎర్రగుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎన్టీఆర్ కాలనీ నీట మునిగింది. ఇళ్లల్లోకి వర్షపు నీరు రావడంతో స్థానిక ప్రజలు రాత్రంతా జాగారం చేస్తూ గడిపారు. గ్రామసమీపన ఉన్న పొలాలలోని నీరంతా ఒక్కసారిగా కాలనీలోకి రావడంతో కాలనీవాసులు గురువారం ఎటుపోలేక వర్షపు నీటిలోనే ఉండవలసిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కాలనీలో నీరు లేకుండా చూడాలని కోరారు.