కార్తీక పౌర్ణమి రోజున పాముల సయ్యాట.. వీడియో వైరల్
AP: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో రెండు పాములు సయ్యాటలాడాయి. శివాలయానికి సమీపంలోనే శేషాచల కొండ దిగువ భాగాన పాములు సయ్యాటలాడటం చూసిన స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే నేడు కార్తీక పౌర్ణమి కావడంతో పాముల సయ్యాటను దేవుని మహత్యంగా స్థానికులు భావిస్తున్నారు. సుమారు గంటకు పైగా రెండు పోడ పాములు ఒకదానితో ఒకటి బుసలు కొట్టుకుంటూ సయ్యాటలాడాయి.