మక్తల్
ఉట్కూర్: రెండు లక్షలకు పైగా ఉన్న రుణాలు మాఫీ చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం రైతుల రెండు లక్షలపైన ఉన్న రుణాలను సైతం రుణమాఫీ చేయాలని జల సాధన సమితి నారాయణపేట జిల్లా కో కన్వీనర్ హెచ్ నర్సింహా సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీరికి లక్ష రూపాయలు మాఫీ కాలేదని, వడ్డీలతో అప్పు రెండు లక్షలు దాటిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల బాధలు అర్థం చేసుకొని బ్యాంక్ లో రెండు లక్షలపైన అప్పు ఉన్న రైతులకు న్యాయం చేయాలన్నారు.