
జూబ్లీహిల్స్: శ్రీరామ నవమి వాల్ పోస్టర్ విడుదల
భక్తుల కొంగుబంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా మంత్రి కొండా సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక ఆదివారం అందించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి కూడా ఆహ్వానం అందించారు.