చిన్నారి గొంతులో ఇరుక్కున్న క్యారెట్.. తప్పిన ప్రమాదం
కొత్తకోట గ్రామానికి చెందిన ఫిజా(01) కు శనివారం క్యారెట్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక చిన్నారి ఫిజా ఉక్కిరిబిక్కిరి కావడంతో గమనించిన బంధువులు వెంటనే కొత్తకోటలోని రాహుల్ మల్టీ స్పెషలిటీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు డా. మనీషా రెడ్డి, వెంకట్ రెడ్డి వారి బృందంతో ఉపరితిత్తుల మధ్యలో క్యారెట్ ముక్క ఇరుక్కున్నట్లు గుర్తించి దానిని బ్రాంకోస్కోప్ సహాయంతో తొలగించడంతో చిన్నారికి ప్రాణగండం తప్పింది.