తెలంగాణ విధ్వంసానికి కారణం కల్వకుంట్ల కుటుంబమే: ఎమ్మెల్యే
కల్వకుంట్ల కుటుంబంలోని ఆ నలుగురే తెలంగాణ విధ్వంసానికి కారణమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజం ఎత్తారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో చేస్తున్న అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అర్థం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.