దేవరకద్ర: సంక్షేమ పథకాలలో పేదలకే ప్రాధాన్యత: ఎమ్మెల్యే జియంఆర్
సంక్షేమ పథకాలలో పేదలకే ప్రాధాన్యత అని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం జానంపేట ప్రజా పాలన గ్రామసభలో ఎమ్మెల్యే జియంఆర్ పాల్గొని మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అర్హులను గుర్తించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీల కతీతంగా అర్హులైన పేద వారికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అన్నారు.