ధూమపానం చేసేవారు పెరుగు తింటే క్యాన్సర్ దూరం
ధూమపానం చేసే వారు ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతుంటారు. దురదృష్టవశాత్తూ పొగ తాగని వారికి కూడా ఈ క్యాన్సర్ వస్తోంది. అయితే రోజూ పెరుగు, ఫైబర్ ఉండే ఆహారం తీసుకుంటే ఈ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. రోజుకు సుమారు 85 గ్రాముల పెరుగు తినే మగవారికి, 113 గ్రాముల పెరుగు తినే ఆడవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు 19% వరకు తక్కువగా ఉంటున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.