బెల్లంపల్లి
గుంతల రహదారితో ఇబ్బందులు
బెల్లంపల్లి మండలం జాతీయ రహదారి మార్గంలో అంకుశం, లింగదరి గూడెం గ్రామాలు, చౌటపల్లి, పోచంపల్లి, దుబ్బగూడా గ్రామాల మార్గంలో అప్రోచ్ రోడ్డు వేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై గుంత ఏర్పడి నీరు నిలిచి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఓ వ్యక్తి బైక్ పైనుంచి పడి గాయాల పాలయ్యారన్న సంఘటన కూడా ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.