ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై కేసు నమోదు
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. ఆదిత్య కన్స్ట్రాక్షన్స్ కంపెనీలో సిట్ పోలీసులు ఇవాళ (శనివారం) తనిఖీలు చేశారు. ఆదిత్య కన్స్ట్రాక్షన్స్ కంపెనీ తనను మోసం చేసిందంటూ వాకాడ తిరుమలరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిత్య కన్స్ట్రాక్షన్స్ కంపెనీపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఆరుగురిని నిందితులుగా పోలీసులు చేర్చారు.