దీపావళి తర్వాత మిగతా రుణమాఫీ చేస్తాం: సీతక్క
తెలంగాణలో రైతు రుణమాఫీపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళి తర్వాత మరో 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని.. మిగతా వారికి దీపావళి పండగ తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పారు.