TG: దారుణం.. తండ్రిని హత్య చేసిన కుమారుడు
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని కుమారుడు హత్య చేశారు. మునుగోడు మండలం చొల్లేడు గ్రామంలో తండ్రి రామచంద్రంపై కుమారుడు దాడి చేసి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.