హయత్ నగర్: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అపరిచిత మహిళను డబ్బు కోసం పాశవికంగా హత్య చేసిన కేసులో నిందితుడు షేక్ బడే మియా(24) దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు శిక్షను న్యాయమూర్తి శుక్రవారం విధించారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు డి. రఘు, శోభా రాణి వాదనలు వినిపించారు. నిందితుడికి జీవిత ఖైదు శిక్ష, రూ. 10, 000 జరిమానా విధించారు.