
సికింద్రాబాద్: ఎస్ఆర్హెచ్ ఆరోపణలపై స్పందించిన హెచ్సీఏ
ఎస్ఆర్హెచ్ తమ ప్రతిష్టను మసకబర్చేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సోమవారం హెచ్పీఏ మండిపడింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నుండి తమకు ఎలాంటి ఈమెయిల్స్ రాలేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. కాగా ఉచిత పాస్ ల కోసం హెచ్సీఏ తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని టికెట్ల విషయమై హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తమను బెదిరించాడని ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.