జనగామ: సదరంకు స్లాట్ బుక్ చేసుకొవాలి'
జనగామ జిల్లాలోని దివ్యాంగులు సదరం క్యాంప్ లో పాల్గొనేందుకు మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని మంగళవారం గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థోపెడిక్, వినికిడి లోపం, దృష్టిలోపం ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 28, 29, 30వ తేదీలలో సదరం క్యాంపులు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు 8008202287 నెంబర్ ను సంప్రదించాలన్నారు.