ప్రజల కోసం పనిచేసిన వారి చరిత్రను తెలియజేయాలి: రాజా సాహెబ్
ప్రజల కోసం తుది వరకు పనిచేసిన వారి జీవిత చరిత్రను నేటి తరానికి అందించాలని ఎంసీపీఐయూ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహ్మద్ రాజా సాహెబ్ అన్నారు. ఈనెల 17 నుంచి 31 వరకు జరిగే మాజీ ఎమ్మెల్యే ఓంకార్ వర్ధంతి పక్షోత్సవాల కరపత్రాలను నర్సంపేటలో బుధవారం ఆవిష్కరించారు. ఓంకార్ వంటి ప్రజా నాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలి కోరారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు.