కదిరి: మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు
కదిరి పట్టణంలో మిస్సింగ్ కేసు ను చేదించినట్లు కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్బంగా సీఐ మీడియాతో మాట్లాడుతూ నిజాం వలి కాలనీలో నిర్వహిస్తున్న మదర్స నుంచి ఇద్దరు అమ్మాయిలు తప్పిపోయారని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆటో డ్రైవర్ సహకారంతో కేసును చేధించినట్లు సీఐ తెలిపారు.