వడమాల పేట: పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గం, వడమాల పేట మండలం, అప్పలాయగుంటలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేస్తుందని తెలిపారు. ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలను ప్రభుత్వం త్వరితగతిన ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు.