అమలాపురం: ప్రజలకు న్యూఇయర్ విషెస్ తెలిపిన కలెక్టర్ మహేశ్
కోనసీమ జిల్లా ప్రజానీకానికి జిల్లా కలెక్టర్ ఆర్ మహేశ్ కుమార్ మంగళవారం 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 సంవ త్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2024 సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పటిష్టంగా అమలు పరిచి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించామన్నారు.