అమలాపురం: ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలి: కలెక్టర్
ఫ్రీ ఓల్డ్ భూములు డేటా ఎంట్రీ, రెవెన్యూ సదస్సులలో అందిన భూసంబంధిత ఫిర్యాదులు పరిష్కారం, రీసర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ మహేష్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి అమరావతి నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అమలాపురం నుంచి కలెక్టర్, జేసీ నిశాంతి పాల్గొన్నారు.