యానం బీచ్ లో సంక్రాంతి సంబరాలు
యానం బీచ్ లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తెలిపారు. ఆముడా ఛైర్మన్ అల్లాడ స్వామి నాయుడు స్వగృహం వద్ద ఆదివారం రాత్రి జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడారు. జనవరి 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంక్రాంతి సంబరాలకు జబర్దస్త్ టీం సభ్యులు హాజరై సందడి చేస్తారన్నారు.