కొవ్వూరులో మహిళ అనుమానాస్పద మృతి
కొవ్వూరులో కాకి పద్మావతి (42) అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందింది. 8వ వార్డు బాలదారి వారి వీధిలో నివాసం ఉంటున్న ఆమె మృతి చెందినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి. విశ్వం తెలిపారు.