బాపట్ల: రేపు ఈ ప్రాంతాలలో విద్యుత్ నిలిపివేత
బాపట్ల పట్టణంలో రేపు (ఆదివారం) 3, 5, 6వ వార్డులతో పాటు అంబేద్కర్ నగర్ , బృందావన కాలనీ ఏరియాలో విద్యుత్ సరఫరా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిలిపి వేయబడునని బాపట్ల టౌన్ సెక్షన్ విద్యుత్ శాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11 కెవి విద్యుత్ వైర్ల మరమ్మత్తుల నేపథ్యంలో సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.